ఇప్పుడే పరిశ్రమలోకి ప్రవేశించిన సుధీర్ బాబు అప్పుడే పరిశ్రమ గురించి తెలుసుకున్నట్టు ఉన్నాడు. తనకంటూ ఒక పేరుని ఎలా సృష్టించుకోవాలో ఈ నటుడికి ఒంటబట్టినట్టుంది. “నాకెప్పుడు మిగిలిన పరిశ్రమలకన్నా తెలుగు పరిశ్రమలో నిలదొక్కుకోవటం చాలా కష్టమయిన పని అనిపిస్తుంది అలా అని మిగిలిన పరిశ్రమలను తక్కువ చెయ్యట్లేదు తెలుగు ప్రజలు మంచి మంచి తారలాను చూసారు కాబట్టి అందరి నుండి అంతటి ప్రదర్శన ఆశిస్తారు” అని సుదీర్ బాబు ట్విట్టర్ లో పేర్కొన్నారు. త్వరలో వంశీ కృష్ణ ఆకెళ్ళ దర్శకత్వంలో రాబోతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ లో ఈ హీరో కనిపించబోతున్నారు. ఈ చిత్రం కోసం ఈయన దేహాన్ని పెంచుతున్నారు. ఈ చిత్రం గురించి మరిన్ని విశేషాలు త్వరలో ప్రకటిస్తారు.