‘ఝుమ్మంది నాదం’ చిత్రంతో తెలుగు చలనచిత్ర సీమకు పరిచయమైన తాప్సీ తెలుగు, తమిళం మరియు హిందీ మూడు భాషల్లోనూ నటిస్తుంది. ఈ భామ తెలుగులో ఇటీవలే గోపీచంద్ సరసన ‘మొగుడు’ చిత్రంలో నటించిన విడుదలై నిరాశ పరిశించింది. రవితేజ తో ‘వీర’ చిత్రంలో నటించింది. వీరి జంట మరోసారి తెరపై కనిపించనుంది. శివ దర్శకత్వంలో బూరుగుపల్లి శివరామకృష్ణ నిర్మిస్తున్న చిత్రంలో రవితేజకి జంటగా తాప్సీ నటిస్తుంది. తమిళంలో ధనుష్ తో ‘ఆడుకలాం’ చిత్రంలో నటించి తమిళ కుర్రకారును గిలిగింతలు పెట్టించింది. ఆ తరువాత జీవాతో ‘వందాన్ వెండ్రాన్’ లోనూ నటించింది. ప్రస్తుతం ఆది (వైశాలి ఫేం) తో ఒక సినిమాలో చేయనుంది. ఇవే కాక ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ లో నటించే అవకాశం కొట్టేసింది. డేవిడ్ ధావన్ దర్శకత్వంలో
‘చష్మే బద్ధూర్’ అనే చిత్రం నటిస్తుంది.
బిజీగా మారిపోయిన తాప్సీ
బిజీగా మారిపోయిన తాప్సీ
Published on Dec 15, 2011 1:55 AM IST
సంబంధిత సమాచారం
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఓటిటి సమీక్ష: ‘మండల మర్డర్స్’ – తెలుగు డబ్ సూపర్ నాచురల్ థ్రిల్లర్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో
- ‘కింగ్డమ్’లో ఆ సర్ప్రైజింగ్ రోల్ కూడా అతడేనా?
- ‘వీరమల్లు’కి అసలు పరీక్ష.. నెగ్గే ఛాన్స్ ఉంది!
- ‘వీరమల్లు’ టికెట్ ధరలు తగ్గింపు.. ఎప్పటినుంచి అంటే!
- ‘కింగ్డమ్’ ముందు గట్టి టార్గెట్?
- ఓటిటి డేట్ ఫిక్స్ చేసేసుకున్న నితిన్ ‘తమ్ముడు’
- ‘వార్-2’లో హృతిక్ కంటే తారక్కే ఎక్కువ..?
- ‘ఓజి’ నుండి ఆ ట్రీట్ వచ్చేది అప్పుడేనా..?