సూర్య రాబోతున్న చిత్రం “మాట్రాన్” ప్రస్తుతం ఇండియా -పాకిస్తాన్ బోర్డర్ భుజ్,గుజరాత్ లో జరుగుతుంది. గత కొన్ని వారాలుగా విభిన్న వాతావరణ పరిస్థితుల మధ్య ఈ చిత్ర బృందం చిత్రీకరణ జరుపుతుంది. కొన్ని నెలల క్రితం ఈ చిత్రం బృందం ఒక పాట చిత్రీకరణ కోసం రాజస్థాన్ వెళ్ళారు ప్రస్తుతం వేడి లో భుజ లో చిత్రీకరణ జరుపుకుంటున్నారు.కాజల్ ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తుంది ఈ చిత్రంలో ఈమె రష్యన్ భాష మాట్లడబోతుందని సమాచారం. కేవి ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో చాలా సన్నివేశాలు తూర్పు ఐరోపాలో చిత్రీకరించారు ఇప్పటికే ఈ చిత్రం మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. ఒక్క పాట మినహా చిత్రీకరణ అంతా పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి హరీస్ జయరాజ్ సంగీతం అందించారు. ఈ ఏడాదిలోనే విడుదల కానున్న ఈ చిత్రాన్ని తెలుగు లో బెల్లంకొండ సురేష్ విడుదల చేస్తున్నారు కొన్నేళ్ళ క్రితం కే వి ఆనంద్ మరియు సూర్య కలయికలో వచ్చిన “వీడొక్కడే” చిత్రం మంచి విజయం సాదించింది. ఈ చిత్రం మీద భారీ అంచనాలు పెరగడానికి ఇదొక కారణం.