మే 2 నుండి సిద్దార్త్ నటించబోతున్న తమిళ చిత్ర చిత్రీకరణ ప్రారంభం కానుంది. ఎప్పుడో మొదలు కావలసిన ఈ చిత్రం పరిశ్రమలో మూడు నెలలుగా జరుగుతున్న స్ట్రైక్ కారణంగా మొదలు కాలేదు. ఈ చిత్రం చెన్నై నుండి బెంగళూరు మధ్యలో హైవే మీద జరిగే కథ అని కోలివుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ చిత్రానికి “దేశీయ నేడుంచలై ” అనే పేరు పరిశీలనలో ఉంచారు. వెట్రిమారన్ సహాయకుడు మణికంటన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. వెట్రి మారన్ ఈ చిత్రానికి కథ అందించారు మరియు ఆయనే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం సిద్దార్త్ మొదటి యాక్షన్ చిత్రం కానుంది. ప్రస్తుతం ఈ నటుడు నందిని రెడ్డి దర్శకత్వం లో హైదరాబాద్ లో చిత్రీకరణలో పాల్గొంటున్నారు