పొడుగు కాళ్ళ సుందరి శృతి హాసన్ స్విట్జర్ ల్యాండ్ లో “గబ్బర్ సింగ్” చిత్రీకరణ పూర్తి చేసుకొని ముంబై పయనమయ్యారు. “గబ్బర్ సింగ్” ప్రచారం మొదలయ్యాక శృతి హైదరాబాద్ రానుంది.ఈ చిత్రం మే రెండవ వారంలో విడుదల కానుంది. ప్రస్తుతం నిర్మాణేతర కార్యక్రమాలు జరుపుకుంటుంది ఈ చిత్రం ఆలస్యం కాకుండా ఉండడానికి గణేష్ బాబు ప్రత్యేక ఎడిటింగ్ బృందాన్ని స్విట్జర్లాండ్ కి తీసుకువెళ్ళారు లొకేషన్ లో సాధ్యమయినంత వరకు పని పూర్తి చేసేద్దామని గణేష్ గారు అనుకుంటున్నారు. హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని గణేష్ బాబు పరమేశ్వర ఆర్ట్స్ బ్యానర్ మీద నిర్మిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ఇప్పటికే జనంలో మంచి విజయం సాదించింది.