హిందీలో మూడు చిత్రాల ఒప్పందం చేసుకున్న శ్రద్ద దాస్

ఈ మధ్య కాలం లో పరిశ్రమ లో బాగా వినిపిస్తున్న పేరు శ్రద్ద దాస్ ఈ మధ్య కాలం లో ఈ భామ ఒప్పుకున్న చిత్రాల సంఖ్య చూస్తుంటే కాలం ఆమె వైపు సాగుతున్నట్టు యిట్టె తెలిసిపోతుంది. ప్రస్తుతం ఈ భామ బాలివుడ్ లో పేరొందిన నిర్మాణ సంస్థ తో మూడు చిత్రాల ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలుస్తుంది. గత సంవత్సరం ఈ భామ మధుర్ భండార్కర్ దర్శకత్వం లో “దిల్ తో బచ్చ హాయ్ జీ” చిత్రం లో నటించింది. ఈ చిత్రం లో తన నటనకి గాను మంచి విమర్శలు అందుకుంది. ఇది కాకుండా ఈ భామ తెలుగులో “రేయ్” మరియు మహేష్ బాబు బావతో మరో చిత్రం చేస్తున్నారు. త్వరలో త్రిభాషా చిత్రం “డ్రాకులా 3D” చిత్ర చిత్రీకరణ లో పాల్గొననుంది. చూస్తుంటే శ్రద్ద బాలివుడ్ లో సిద్దపడే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది.

Exit mobile version