ప్రముఖ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన తాజా చిత్రం “డిపార్ట్ మెంట్” చూడాలని అనుకుంటున్నారు. ఈ చిత్రం కి పూర్తిగా నెగెటివ్ టాక్ వచ్చినా కూడా ఈ చిత్రాన్ని చూడాలి అనుకుంటున్నారు “ప్ర్రిమియర్ షో మిస్ అయ్యాను ఈ చిత్రానికి ప్రతికూల విమర్శలు వస్తున్న ఇందులో రోగ్ విధానం ఎలా ఉందో చూడాలి” అని ట్విట్టర్ లో అన్నారు. ఈ చిత్రం లో రామ్ గోపాల్ వర్మ కెమరాని ఎలా ఉపయోగించారని చూడటానికి రాజమౌళి ఈ చిత్రాన్ని చూసేలా ఉన్నారు. ఈ రోగ్ విధానాన్ని చిత్రానికి ఉపయోగపడేలా ఎలా తీయాలో రాజమౌళి భవిష్యత్తులో చూపిస్తారేమో వేచి చూడాలి.