ప్రభాస్,రిచా గంగోపాధ్యాయ మరియు అనుష్క ప్రధాన పాత్రలలో తెరకెక్కుతున్న చిత్రం “వారధి” గతేడాది నవంబర్ లో చిత్రీకరణ మొదలు పెట్టుకుంది. కొంత భాగం చిత్రీకరణ జరుపుకున్నాక ఈ చిత్ర చిత్రీకరణ ఆపేశారు ఎందుకంటే ర్పభాస్ “రెబెల్” చిత్రాన్ని పూర్తి చెయ్యాలని అనుకున్నారు దీని మూలంగా రిచా రెండు వారాలు విశ్రాంతి తీసుకుంది. ఈ రెండు వారాలు అమెరికా లో గడిపింది. ఈ చిత్ర తరువాతి షెడ్యూల్ జూన్ లో మొదలవుతుంది నిర్మాతలు ఈ చిత్రాన్ని తొందరగా పూర్తి చేసి ఈ సంవత్సరం లోనే విడుదల చెయ్యాలని యోచిస్తున్నారు.కొరటాల శివ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు.