త్వరలో కెమరా ముందుకి “కెమరామాన్ గంగతో రాంబాబు”

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు పూరి జగన్నాథ్ ల చిత్రం “కెమరా మాన్ గంగ తో రాంబాబు” చిత్ర చిత్రీకరణ జూన్ 8 నుండి ప్రారంభం కానుంది. ఈ చిత్రం రెగ్యులర్ చిత్రీకరణ జరుపుకొని ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్ 18న విడుదల కానుంది. తమన్నా ఈ చిత్రంలో కథానాయికగా కనిపించనున్నారు. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు ఈ చిత్రం మీడియా మీద వ్యంగ్యాస్త్రం ఉండబోతుంది . చాలా రోజుల తరువాత పూరి మరియు పవన్ కళ్యాణ్ లు కలిసి పని చెయ్యటం మూలాన ఈ చిత్రం మీద ఇప్పటికే అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. వీరు ఇద్దరు గతంలో “బద్రి”చిత్రం కోసం కలిసి పని చేశారు ఆ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్తర్ అయ్యింది.

Exit mobile version