పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన పంజా చిత్రం నిన్న భారీ గా విడుదల అయిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం రాష్ట్రం లో అన్ని చోట్లా భారీ గా విడుదల అవటం తో ఓపెనింగ్స్ బాగుంటే అని విశ్లేషకుల అంచనా. ప్రస్తుతం గుంటూరు జిల్లా మొదటి రోజు కలెక్షన్లు సుమారు 78 లక్షలు అని తెలుస్తోంది. గుంటూరు జిల్లాకు ఇది మంచి కలెక్షన్లు అనే చెప్పాలి.
విష్ణువర్ధన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి మంచి స్టైలిష్ గా ఉందనే పేరు వస్తోంది. శోభు యార్లగడ్డ మరియు నీలిమ తిరుమలశెట్టి ఈ చిత్రానికి నిర్మాతలు.