వంద కోట్లతో డ్యూడ్.. హ్యాట్రిక్ హిట్‌తో అల్లాడించిన ప్రదీప్

వంద కోట్లతో డ్యూడ్.. హ్యాట్రిక్ హిట్‌తో అల్లాడించిన ప్రదీప్

Published on Oct 23, 2025 6:30 PM IST

Dude

మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన తాజా చిత్రం “డ్యూడ్” పండుగ సీజన్‌ పూర్తయిన తర్వాత కూడా థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. లవ్, కామెడీ ప్రధాన అంశాలతో రూపొందిన ఈ చిత్రంలో ప్రదీప్ రంగనాథన్, మమితా బైజు ప్రధాన పాత్రల్లో నటించగా కీర్తిశ్వరన్ దర్శకత్వం వహించారు.

తాజాగా ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 100 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి సాలిడ్ విజయాన్ని అందుకుంది. దాంతో ఈ దీపావళి సీజన్‌లో ఈ మైలురాయిని చేరిన మొదటి సినిమాగా డ్యూడ్” నిలిచింది. “లవ్ టుడే”, “డ్రాగన్” తర్వాత ఇది ప్రదీప్ రంగనాథన్ కెరీర్‌లో వరుసగా మూడవ 100 కోట్ల సినిమాగా నిలిచింది.

మిడ్‌రేంజ్ హీరోకి ఈ స్థాయి వసూళ్లు సాధించడం గొప్ప విషయమే. మూడు సార్లు 100 కోట్ల క్లబ్‌లో చేరడం ప్రదీప్‌కు ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చింది. “డ్యూడ్” ఆయనను కొలీవుడ్‌లో వేగంగా ఎదుగుతున్న స్టార్‌గా మరోసారి నిరూపించింది. ఈ చిత్రంలో నేహా శెట్టి, శరత్‌కుమార్, రోహిణి, హృదు హరూన్, సత్య ముఖ్య పాత్రల్లో నటించగా సంగీతాన్ని సాయి అభ్యంకర్ అందించారు.

తాజా వార్తలు