మలయాళంలో తెరకెక్కిన లేడీ ఓరియెంటెడ్ సూపర్ హీరో మూవీ ‘కొత్త లోక చాప్టర్ 1’ తెలుగులో కూడా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమాలో కళ్యాణి ప్రియదర్శి తనదైన యాక్షన్‌తో ఆకట్టుకోగా, ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రూ.300 కోట్ల వసూళ్లతో దుమ్ములేపింది.
ఇక ఈ సినిమా ఓటీటీ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జియో హాట్‌స్టార్ దక్కించుకుంది. దీంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలో వస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. కాగా, ఈ సినిమా దీపావళి సందర్భంగా ఓటీటీ స్ట్రీమింగ్ అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ, దీపావళికి ఈ చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్ కాలేదు.
మరి ఈ చిత్రం ఇంకెప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్కు వస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. డొమినిక్ అరుణ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను దుల్కర్ సల్మాన్ ప్రొడ్యూస్ చేశారు.


