రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తున్న హను రాఘవపూడి దర్శకత్వంలోని సినిమా టైటిల్‌ను అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రానికి “ఫౌజీ” అనే టైటిల్ కన్ఫర్మ్ చేశారు. టైటిల్‌తో పాటు విడుదల చేసిన ప్రభాస్ ఫస్ట్ లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇక అభిమానులు మరిన్ని అప్డేట్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుండగా, కన్నడ నటి చైత్ర జె.ఆచార్ ఈ పీరియాడిక్ యాక్షన్ రొమాంటిక్ డ్రామాలో భాగమని తెలుస్తోంది. ఆమె గతంలో 3BHK చిత్రంలో నటించింది. ‘ఫౌజీ ఒక అద్భుతమైన సృష్టి’ అంటూ ఆమె హను రాఘవపూడి పనిని ప్రశంసించడంతో ప్రభాస్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఇమాన్వి హీరోయిన్గా నటిస్తుండగా, జయప్రద, మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సంగీతాన్ని విశాల్ చంద్రశేఖర్ అందిస్తున్నారు.