టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత ప్రొఫెషనల్ లైఫ్ సాఫీగా సాగినా, ఆమె పర్సనల్ లైఫ్ మాత్రం అనుకున్నంత సక్సెస్ కాలేదు. అక్కినేని నాగచైతన్యతో ప్రేమ వివాహం చివరకు విడాకులకు దారి తీసింది. ఇక తన జీవితంలోని కష్టాలు, ఎదురుదెబ్బల గురించి సమంత రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది.
తన కెరీర్‌లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నానని. తనను ఇష్టపడని వారు తన కష్టకాలంలో నవ్వుకున్నారని ఆమె తెలిపింది. తాను విడాకులు తీసుకున్న సమయంలో కొందరు సంబరాలు జరుపుకున్నారని.. అయితే, తాను ఇప్పుడు ఎవరి మాటలు పట్టించుకోవడం లేదని తెలిపింది. ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇక సమంత ప్రస్తుతం బాలీవుడ్‌లో ‘రక్త్ బ్రహ్మాండ్’ అనే చిత్రంతో బిజీగా ఉంది. అటు నందిని రెడ్డి దర్శకత్వంలో ‘మా ఇంటి బంగారం’ అనే సినిమాతో తెలుగులో రీఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతోంది.