యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య ,కామెడీ హీరో సునీల్ తో కలిసి ఒక చిత్రం చెయ్యనున్నారు తమిళ చిత్రం “వెట్టై” చిత్ర రీమేక్ లో వీరు ఇరువురు కలిసి కనిపించబోతున్నారు. బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి డాలీ(కిషోర్) దర్శకత్వం వహిస్తున్నారు.”వెట్టై” చిత్రం తెలుగు లో “భలే తమ్ముడు” గా విడుదల కావలసి ఉండగా ఇప్పుడు బెల్లం కొండ సురేష్ ఈ చిత్రాన్ని రిమేక్ చెయ్యాలని నిర్ణయించుకున్నారు భయపడే పోలీసు పాత్రలో సునీల్ కనిపించనున్నారు నాగ చైతన్య ఆర్య పాత్రలో కనిపించబోతున్నారు ఈ చిత్రం కోసం ఇద్దరు ప్రముఖ కథానాయికలను సంప్రదించినట్టు తెలుస్తుంది అధికారిక ప్రకటన త్వరలో జరగనుంది. ఈ చిత్ర చిత్రీకరణ 26 జూన్ నుండి మొదలు కానుంది.