ఇంటర్వెల్ ముందు ఎంట్రీ ఇవ్వనున్న నాగార్జున

ఇంటర్వెల్ ముందు ఎంట్రీ ఇవ్వనున్న నాగార్జున

Published on Dec 8, 2011 4:46 PM IST

అక్కినేని నాగార్జున నటిస్తున్న ‘రాజన్న’ చిత్రం అన్ని పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకొని డిసెంబరు 23న విడుదలకు సిద్ధమవుతుంది.ఈ సినిమా కథ 1960 లో తెలంగాణా ప్రాంతానికి చెందిన కథ. ఈ సినిమాకి సంభందించిన ఒక ఆసక్తికరమైన విషయం తెలిసింది. నాగార్జున పాత్ర ఎంట్రీ ఇంటర్వెల్ కి ముందు ఉంటుంది. ఈ సినిమాలో మల్లి పాత్ర పోషించే ‘ఏనీ’ ముఖ్య పాత్ర పోషిస్తుండగా సినిమా బాగా తీర్చి దిద్దారని సమాచారం. ఇప్పటికే కీరవాణి అందించిన ఆడియో విడుదలై విశేష ఆదరణ పొందింది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా
సినిమాకి హైలెట్ అవుతుందని సమాచారం. స్నేహ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి ప్రముఖ రచయిత రాజమౌళి గారి తండ్రి అయిన విజయేంద్ర ప్రసాద్ గారు దర్శకత్వం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు