లేడీ ఓరియంటడ్ కథతో తెర మీదకి తిరిగి రాబోతున్న ముమైత్ ఖాన్

గత కొద్ది రోజులుగా ముమైత్ ఖాన్ తెరకు దూరంగా ఉంటున్నారు. ఇప్పుడు ఈ భామ ఒక లేడీ ఓరియంటడ్ చిత్రం తో తిరిగి తెర మీదకు రాబోతున్నారు. ఈ చిత్రానికి డి కే నాగేశ్వర రావు దర్శకత్వం వహించనున్నారు గతం లో ఈయన “అంటి,అంకుల్,నందగోపాల్” చిత్రానికి దర్శకత్వం వహించారు. కే ఎస్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. నిర్మాత మాట్లాడుతూ ” మహా రాష్ట్ర్ర లో జరిగిన ఉదంతం ని ఆధారంగా తీసుకొని ఈ చిత్ర కథను సిద్దం చేశారు.ప్రస్తుతం ఈ చిత్రానికి సంగీత చర్చలు జరుగుతున్నాయి. చిత్రం హైదరాబాద్,ముంబై మరియు బ్యాంకాక్ ల లో చిత్రీకరిస్తాము” అని అన్నారు. ప్రవీణ్ లమ్మిడి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇదిలా ఉండగా ముమైత్ ఖాన్ “రౌడీ రాథోర్” చిత్ర విడుదల కోసం వేచి చూస్తుంది. ఈ చిత్రంలో మరియం జకారియ మరియు శక్తి మోహన్ లతో పాటు ఈ భామ ఒక ఐటం సాంగ్ లో డాన్స్ చేసింది.

Exit mobile version