రీమేక్ కాబోతున్న మణిరత్నం “ఘర్షణ”

మణిరత్నం తీసిన గొప్ప చిత్రాలలో “ఘర్షణ” చిత్రం ఒకటి. ఈ చిత్రం త్వరలో తెలుగు మరియు తమిళంలో రీమేక్ చెయ్యనున్నారు ఈ చిత్ర హక్కులను తాండ్ర రమేష్ కొనుక్కున్నారు ఈ ద్విభాషా చిత్రాన్ని రియల్ మీడియా బ్యానర్ మీద అయన నిర్మించనున్నారు. తమిళంలో “అగ్ని నక్షత్రం”గా విడుదలయిన ఈ చిత్రం తెలుగులో “ఘర్షణ” పేరుతో విడుదలయ్యింది.ఈ చిత్రం లో ప్రభు,కార్తీక్,నిరోష మరియు అమల లు ప్రధాన పాత్రలు పోషించారు ఇళయరాజా సంగీతం అందించిన ఈ చిత్రం భారీ విజయం సాదించింది.ప్రస్తుతం ఈ చిత్రం లో పాత్రల కోసం తాండ్ర రమేష్ తెలుగు మరియు తారలు మరియు దర్శకులతో చర్చల్లో ఉన్నారు. ఈ చిత్రం బృందం గురించిన వివరాలు త్వరలో వెల్లడిస్తారు.

Exit mobile version