కన్నడ ప్రభాకర్ తనయుడు వినోద్ ప్రభాకర్ హీరోగా గౌరీ ముంజల్, అభినయశ్రీ కథానాయికలుగా శివగంగ ఆర్ట్స్ క్రియేషన్స్ పతాకంపై హ్యేట్రిక్ నాగేంద్ర దర్శకత్వంలో కన్నడంలో విజయం సాధించిన చిత్రాన్ని తెలుగులో కోరమీసం అనే పేరుతో అందిస్తున్నారు నిర్మాత శివ వెంకట సుబ్రహ్మణ్యం. గత నెల హైదరాబాద్ ఫిలిం చాంబర్ లో డాక్టర్ డి. రామానాయుడు గారి చేతుల మీదుగా ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఆడియో విడుదలైంది. ఈ చిత్రం ఆడియోతో పాటు సినిమా సక్సెస్ కావాలని అతిధులు అభిప్రాయాన్ని తెలియజేసారు. ప్రస్తుతం డిటీఎస్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని ఈ నెల చివరి వారంలో విడుదల చేయడానికి నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు.
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: ‘మహావతార నరసింహ’ – ఇంప్రెస్ చేసే డివోషనల్ యాక్షన్ డ్రామా
- సమీక్ష : తలైవన్ తలైవీ – కొన్నిచోట్ల మెప్పించే ఫ్యామిలీ డ్రామా
- ‘పెద్ది’ ఫస్ట్ సింగిల్ డేట్ లాకయ్యిందా?
- 24 గంటల్లో 10వేలకు పైగా.. కింగ్డమ్ క్రేజ్ మామూలుగా లేదుగా..!
- ‘కింగ్డమ్’లో ఆ సర్ప్రైజింగ్ రోల్ కూడా అతడేనా?
- ‘మహావతారా నరసింహ’ కి సాలిడ్ రెస్పాన్స్!
- ఆరోజున సినిమాలు ఆపేస్తాను – పుష్ప నటుడు కామెంట్స్
- ‘వీరమల్లు’ టికెట్ ధరలు తగ్గింపు.. ఎప్పటినుంచి అంటే!