ఈ సినిమా ఫ్లాప్ అవుతుందని నాకు తెలుసు – శ్రుతి హాసన్

3 చిత్ర ఫలితం తనకి విడుదలకు ముందే తెలుసని పొడుగు కాళ్ళ సుందరి శ్రుతి హాసన్ చెప్పారు. ఒకానొక తెలుగు దిన పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఈ భామ కొనిన్ ఆసక్తి కరమయిన మాటలు చెప్పారు. “ఒక చిత్రానికి పని చేసేప్పుడు ఆ చిత్రం ఎలా రాబోతుంది అన్న విషయం నటించేవారికి తెలుస్తుంది బాక్స్ ఆఫీస్ వద్ద ఎలా ఆడుతుందనే విషయం కూడా తెలుస్తుంది ఈ చిత్రం చేసేప్పుడు కథ సంక్లిష్టమయినది అనిపించింది” అని శ్రుతి హాసన్ అన్నారు. “అయితే ఈ చిత్రం ఎందుకు ఒప్పుకున్నారు అని అడుగగా చిత్ర కథ చెప్పేప్పుడు ఇందులో నా పాత్ర మాత్రమే నాకు చెప్పారు. చిత్రీకరణ మొదలయ్యకే చిత్ర కథ మొత్తం తెలుసుకున్నాను అప్పుడే అనుకున్నాను ఈ చిత్రం పరాజయం చవి చూస్తుందని”

Exit mobile version