తమన్నా ఎప్పుడు తప్పుడు కారణాలతోనే వార్తల్లో నిలుస్తుంది అవి కూడా డేట్స్ విషయం లోనే జరుగుతుంటుంది. ప్రస్తుతం తను చాలా దృడంగా ఉంది ఇప్పుడు ఉన్న సినిమాలు చేసాకే మరో చిత్రాన్ని ఒప్పుకోవాలని. ప్రస్తుతం “రచ్చ”,”రెబెల్” మరియు “ఎందుకంటే ప్రేమంట” చిత్రాలలో నటిస్తున్నారు. ఈ విషయమయి తమన్నా మాట్లాడుతూ ” నా దగ్గరకి వచ్చిన ప్రతి చిత్రాన్ని చేసేయాలని తొందర లేదు నాకు బాగా నచ్చిన చిత్రాలను ముందు చేస్తాను” అని అన్నారు. ఈ చిత్రాలన్నీ ఈ వేసవి కి విడుదల కానున్నాయి. ఆ తరువాత ఎటువంటి చిత్రాన్ని ఒప్పుకోలేదు. రానున్న కొన్ని నెలల పాటు ఈ భామ తన కెరీర్ ని ఎలా ప్లాన్ చేసుకుంటుందో వేచి చూడాలి.