గబ్బర్ సింగ్ చిత్ర తాజా షెడ్యూల్ రామోజీ ఫిలిం సిటి లో మొదలయ్యింది. ఈ చిత్ర బృందంతో శ్రుతి హాసన్ కలిసింది. ఈ చిత్ర ప్రోమోస్ కి అద్బుతనయిన స్పందన కనపడిన తరువాత దర్శకుడు హరీష్ శంకర్ ఈ చిత్ర పాటలను తెరకెక్కించడంలో మరింత శ్రద్ద కనబరుస్తున్నారు. అభిమానులకు పండగవంటి చిత్రాన్ని అందిస్తానని హరీష్ శంకర్ చెప్పారు. సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రం లో పవన్ కళ్యాణ్ కొన్ని అద్బుతమయిన డాన్స్ లు వెయ్యబోతున్నారు. ఈ చిత్ర ఆడియో ఏప్రిల్ 15న విడుదల కానుంది ఇప్పటికే ఈ చిత్రం మీద అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. గణేష్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.