ఎస్ ఎస్ రాజమౌళి రాబోతున్న మాయాజాలం “ఈగ” చిత్రం గతంలో ప్రకటించిన విధంగా మే 30న విడుదల కావట్లేదు. ఈ చిత్ర గ్రాఫిక్స్ చాలా సమయం తీసుకుంటున్నట్టు తెలుస్తుంది ఇంత సమయం తీసుకుంటుంది అని రాజమౌళి మరియు చిత్ర బృందం ఊహించలేదు ఈ విషయాన్నీ ధృవీకరిస్తూ రాజమౌళి ట్విట్టర్లో ఇలా అన్నారు ” ఈగ చిత్రం కోసం వేచి చూస్తున్న ప్రతి ఒక్కరిని ఈ విషయం నిరుత్సాహం కలిగిస్తుంది అని నాకు తెలుసు. ఈగ చిత్రం ఈ నెల 30న విడుదల కావట్లేదు అని చెప్పడానికి చింతిస్తున్నాను. నేను కూడా ఈ విషయంలో నిరుత్సాహానికి లోనయ్యాను ఈ చిత్ర గ్రాఫిక్స్ కి పట్టే సమయాన్ని మేము సరిగ్గా లెక్క పెట్టలేకపోయాము ఇప్పటి వరకు చేసిన సన్నివేశాలు అద్బుతంగా వచ్చాయి మిగిలినవి కూడా అలానే రావాలని అనుకుంటున్నాను ప్రతి ఒకరు పగలు రాత్రి కష్టపడి పని చేస్తున్నారు ఈ చిత్రం ఎంత వీలయితే అంత తొందరగా విడుదల చేస్తాము. నన్ను మన్నిస్తారని అనుకుంటున్నాను” అని అన్నారు. నాని, సమంత మరియు సుదీప్ లు ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నఈ చిత్రాన్ని సాయి కొర్రపాటి నిర్మిస్తున్నారు. డి సురేష్ బాబు ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.