బిజినెస్ మాన్ ఆఖరి రోజు నేడే

బిజినెస్ మాన్ ఆఖరి రోజు నేడే

Published on Dec 10, 2011 2:39 PM IST

ప్రిన్స్ మహేష్ బాబు నటించిన ‘బిజినెస్ మాన్’ చిత్రం షూటింగ్ నేటితో పూర్తవుతుంది. కాచిగూడ రైల్వే స్టేషన్ లో ఆఖరి సీన్లను చిత్రీకరించారు.పూరి జగన్ దర్శకత్వం లో రూపొందిన ఈ చిత్రం షూటింగ్ సెరవేగం గా జరిగింది. పరిశ్రమ వర్గాలను విస్తు పరిచే విధం గా ఈ చిత్రాన్ని కేవలం 75 రోజుల లోపే చిత్రీకరించారు.

ఈ చిత్రానికి కాజల్ హీరోయిన్.వెంకట్ ఈ చిత్రాన్ని ఆర్.ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. జనవరి 11 2012 న ఈ చిత్రం విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ నెలలో చిత్రం ఆడియో ను ఆవిష్కరించనున్నారు. తమన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు