విక్టరీ వెంకటేష్ మరియు మహేష్ బాబు నటిస్తున్న మల్టి స్టారర్ చిత్రం ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రంలో వెంకీ సరసన అమలా పాల్ నటించబోతున్నట్లు తాజా సమాచారం. వెంకీ మరియు మహేష్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించనున్నారు. వెంకీ భార్య పాత్ర కోసం చాలా మంది హీరోయిన్సును సంప్రదించగా చివరికి అమలా పాల్ ఓకే చేసినట్లు సమాచారం. దీని గురించి అధికారికంగా ధ్రువీకరించనప్పటికీ మాకు అందిన విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం. చాలా రోజుల తర్వాత తెలుగులో వస్తున్న మల్టి స్టారర్ చిత్రం కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందించబోతున్నారు. త్వరలో షూటింగ్ ప్రారంభం ప్రారంభం కానున్న ఈ చిత్రంలో వెంకీ-మహేష్ కి తండ్రిగా ప్రకాష్ రాజ్ చేయబోతున్నారు.
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఓటిటి సమీక్ష: ‘మండల మర్డర్స్’ – తెలుగు డబ్ సూపర్ నాచురల్ థ్రిల్లర్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో
- ‘కింగ్డమ్’లో ఆ సర్ప్రైజింగ్ రోల్ కూడా అతడేనా?
- ‘వీరమల్లు’కి అసలు పరీక్ష.. నెగ్గే ఛాన్స్ ఉంది!
- ‘వీరమల్లు’ టికెట్ ధరలు తగ్గింపు.. ఎప్పటినుంచి అంటే!
- ‘కింగ్డమ్’ ముందు గట్టి టార్గెట్?
- ఓటిటి డేట్ ఫిక్స్ చేసేసుకున్న నితిన్ ‘తమ్ముడు’
- ‘వార్-2’లో హృతిక్ కంటే తారక్కే ఎక్కువ..?
- ‘ఓజి’ నుండి ఆ ట్రీట్ వచ్చేది అప్పుడేనా..?