రెండవ షెడ్యూల్ కి సిద్దమయిన నరేష్ 3డి చిత్రం

కామెడీ కింగ్ అల్లరి నరేష్ 3డి చిత్రం “యాక్షన్” ఈ నెల 10 నుండి రెండవ షెడ్యూల్ మొదలు పెట్టుకోనుంది. ఈ చిత్ర చిత్రీకరణ హైదరాబాద్ శివార్లలో అటవీ ప్రాంతంలో జరుపుకోనుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు చిత్రం “దూకుడు” నిర్మాతల్లో ఒకరయిన అనిల్ సుంకర ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం కోసం నిర్మాతలు చాలా కస్టపడి చేస్తున్నారు. కిక్ శ్యాం, వైభవ్ మరియు రాజ సుందరం ఈ చిత్రంలో అల్లరి నరేష్ తో పాటు కనిపించనున్నారు. స్నేహ ఉల్లాల్, కామ్నజేత్మలాని ఈ చిత్రంలో కథానాయికలుగా కనిపించనున్నారు. సుంకర రామబ్రహ్మం ఈ చిత్రాన్ని ఏ కే ఎంటర్ టైన్మెంట్ పతాకం మీద నిర్మిస్తున్నారు. బప్పి లహరి కొడుకు బప్పా లహరి ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా తమన్ నేఫధ్య సంగీతం అందిస్తున్నారు.

Exit mobile version