మాములుగా అందరికి సిక్స్త్ సెన్స్ పని చెయ్యదు ఒక వ్యక్తి కి సిక్స్త్ సెన్స్ పని చేస్తే దాని ఆధారంగా అతడు జీవించడం మొదలు పెడితే ఈ ఆలోచనకు ప్రతిరూపమే మా “సిక్స్త్ సెన్స్” చిత్రమని దర్శకుడు పెద్ది.కే.ఈశ్వర్ అన్నారు. విక్రం మరియు కౌష లు ప్రధాన పాత్రలలో నటిస్తున్న ఈ చిత్రాన్ని ఎం దివాకర్ బాబు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఆడియో బుధవారం హైదరాబాద్ లో విడుదలయ్యింది. దర్శకుల సంఘం అద్యక్షుడు దర్శకుడు సాగర్ మొదటి సి డి ని విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ” సిక్స్త్ సెన్స్ ఆధారంగా తను ఏ పనులు చెయ్యాలో నిర్ణయించుకునే యువకుడి కథ ఈ చిత్రం” అని అన్నారు.