యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ‘మిర్చి’ అద్బుతమైన విజయాన్ని సాదించింది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 40కోట్ల షేర్ సాదించింది. ఈ విజయంతో ప్రభాస్ అగ్ర హీరోల జాబితాలో చేరిపోయాడు. కొన్ని ప్రాంతాలలో ఇంకా ఈ సినిమా కలెక్షన్లు తగ్గకుండా నడుస్తోంది. ఇది ప్రభాస్ కెరీర్ లోనే పెద్ద హిట్ సినిమా. నిన్నటి వరకు ఈ సినిమా నైజాం, సీడెడ్ ప్రాంతాలలో 16కోట్ల షేర్ ను, అలాగే ఆంద్రప్రదేశ్ లోని మిగిలిన ప్రాంతాలలో 18కోట్ల షేర్ ను సాదించింది. కర్ణాటక,ఇతర ప్రదేశాలలో కలుపుకొని ఈ సినిమా ఇప్పటికి 40కోట్ల షేర్ సాదించిందని సమాచారం.
యువి క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించిన ఈ సినిమాకు కొరిటాల శివ దర్శకత్వం వహించాడు. అనుష్క, రిచా గంగోపద్యాయ హీరోయిన్స్ గా నటించగా దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు.