తమిళంలోకి డబ్ అవుతున్న రవితేజ మిరపకాయ్

తమిళంలోకి డబ్ అవుతున్న రవితేజ మిరపకాయ్

Published on Oct 22, 2012 6:00 PM IST


ఈ మధ్యన చాలా తెలుగు చిత్రాలను తమిళంలోకి అనువదిస్తున్నారు. పలు చిత్రాలను నేరుగా కూడా విడుదల చేస్తున్నారు అలా విడుదలయిన “ఈగ చిత్రం అక్కడ భారీ విజయం సాదించడం అనువాదాలకు మంచి డిమాండ్ ని సృష్టించింది. మాస్ మహారాజ రవితేజ,రిచా గంగోపాధ్యాయ్ మరియు దీక్షసేత్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన వినోదాత్మక చిత్రం “మిరపకాయ్” ఇప్పుడు తమిళంలోకి అనువదిస్తున్నారు. తెలుగులో భారీ విజయం సాదించిన ఈ చిత్రాన్ని తమిళంలోకి “మొరట్టుసింగం” అనే పేరుతో విడుదల చేస్తున్నారు. హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ఎస్ ఎస్ తమన్ సంగీతం అందించారు. ఈ చిత్రాన్ని అమృతా మూవీ మేకర్స్ పతాకంపై రాజవంశి తమిళంలోకి అనువదిస్తోంది. ఈ చిత్రం త్వరలో తెరపైకి రానుంది.

తాజా వార్తలు