చిరు టీజర్లో దీనిపైనే స్కై హై ఎక్స్పెక్టేషన్స్.!

చిరు టీజర్లో దీనిపైనే స్కై హై ఎక్స్పెక్టేషన్స్.!

Published on Aug 19, 2020 10:31 AM IST

మెగా ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ అప్డేట్ ఈ ఆగష్టు 22న మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు కావడంతో తాను నటిస్తున్న 152 వ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల కానుంది. దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్ పై ఎన్నో అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే.

అలాగే అదే రోజున ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు మోషన్ పోస్టర్ టీజర్ ను విడుదల చెయ్యనున్నట్టుగా చిత్ర యూనిట్ కన్ఫర్మ్ చేసారు. మరి ఈ రెండిట్లో మాత్రం మెగా ఫ్యాన్స్ మోషన్ పోస్టర్ కోసమే ఎక్కువగా ఎదురు చూస్తున్నారట. అందుకు బలమైన కారణం కూడా లేకపోలేదు.

మెగాస్టార్ మోస్ట్ పవర్ ఫుల్ అండ్ ఫేవరేట్ మ్యూజికల్ కాంబో మణిశర్మతో ఈ ప్రాజెక్ట్ చేస్తుండటంతో మెగా ఫ్యాన్స్ మరియు మ్యూజిక్ లవర్స్ ఈ టీజర్ పైనే తారా స్థాయి అంచనాలు పెట్టుకున్నారు. ఎందుకంటే మణిశర్మ పాటలు కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఎప్పుడూ డిజప్పాయింట్ చేసిన దాఖలాలు లేవు. అందులోనూ చిరుతో సినిమాల్లో ఇచ్చిన బీజీఎమ్ అయితే ఎలెక్ట్రిఫయింగ్ గా ఉంటుంది. అందుకే ఈ పర్టిక్యూలర్ అంశంపై మాత్రం ఓ రేంజ్ అంచనాలు ఉన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు