మెగా హీరోలలో స్టార్ హీరోలకు కొదవే లేదు. మెగాస్టార్ చిరంజీవి లెగసీని స్టార్ హీరోలుగా పవన్ కళ్యాణ్, చరణ్, బన్నీ ముందుకు తీసుకెళుతున్నారు. వీరి తరువాత స్టార్ హీరో హోదాపై కన్నేశారు వరుణ్ తేజ్ మరియు సాయి ధరమ్. ఈ ఇద్దరు హీరోలు కెరీర్ మొదలుపెట్టి దాదాపు ఆరేళ్ళు అవుతుంది. ఇప్పటికే కొన్ని హిట్స్ వీరి ఖాతాలో ఉన్నాయి. వరుణ్ హై సక్సెస్ రేట్ తో స్టడీగా కెరీర్ ని ముందుకు తీసుకెళుతుండగా, ధరమ్ కెరీర్ అప్ అండ్ డౌన్స్ తో సాగుతుంది.
కాగా ఈ యంగ్ మెగా హీరోలు సక్సెస్ ల తర్వాత రెమ్యూనరేషన్ భారీగా పెంచేశారని తెలుస్తుంది. వరుణ్ ఈ మధ్య వరుస హిట్స్ అందుకుంటున్నారు. గత ఏడాది ఆయన చేసిన ఎఫ్ 2 బ్లాక్ బస్టర్ హిట్ కాగా, గద్దలకొండ గణేష్ హిట్ టాక్ తెచ్చుకుంది. దీనితో ఆయన తన పారితోషికం డబుల్ చేశారని తెలుస్తుంది. ఆయన డబుల్ డిజిట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారట. ప్రతిరోజూ పండగే చిత్రంతో హిట్ ట్రాక్ ఎక్కిన ధరమ్ సైతం ప్రస్తుతం తీసుకుంటున్న దానికి డబుల్ చేశారట.