తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న లాస్ట్ మూవీ ‘జన నాయగన్’ కోసం అభిమానులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు హెచ్.వినోద్ డైరెక్ట్ చేస్తుండగా పూర్తి పొలిటికల్ థ్రిల్లర్ మూవీగా ఈ చిత్రం ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతుంది.
ఇక ఈ సినిమాలో అందాల భామ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే, తాజాగా ఈ సినిమాలో ఆమె పాత్రకు సంబంధించిన షూటింగ్‌ను పూజా మెగించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆమె తన ఇన్‌స్టా స్టోరీలో ఓ పోస్ట్ చేసింది.
విజయ్-పూజా హెగ్డే జోడీకి అభిమానుల్లో మంచి క్రేజ్ ఉంది. దీంతో ఇప్పుడు ఈ సినిమాలో వీరిద్దరి కెమిస్ట్రీ ఎలా ఉండబోతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఈ చిత్రాన్ని కెవిఎన్ ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు.