‘కూలీ’లో ఆ హీరో ఎంతసేపు కనిపిస్తాడంటే..?

‘కూలీ’లో ఆ హీరో ఎంతసేపు కనిపిస్తాడంటే..?

Published on Jun 17, 2025 3:00 AM IST

Rajinikanth and Lokesh Kanagaraj's Coolie

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కూలీ’ కోసం ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు లోకేశ్ కనగరాజ్ డైరెక్ట్ చేస్తుండగా పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ ప్రేక్షకులను అలరించనుంది. ఇక ఈ సినిమాకు సంబంధించి రోజుకో వార్త సినీ సర్కిల్స్‌లో జోరుగా చక్కర్లు కొడుతోంది.

ఈ సినిమాలో అక్కినేని నాగార్జున, ఉపేంద్ర కీలక పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక మరో స్టార్ హీరో అమీర్ ఖాన్ కూడా ఈ సినిమాలో ఓ పవర్‌ఫుల్ కేమియో పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో ఆయన పాత్ర ప్రేక్షకులను స్టన్ చేయడం ఖాయమని చిత్ర యూనిట్ చెబుతోంది. కాగా, ఈ సినిమాలో అమీర్ ఖాన్ కనిపించేది దాదాపు 8 నిమిషాలు అని తెలుస్తోంది.

ఇంత తక్కువ సమయం అయినా, కూడా ఆయన చేయబోయే ఇంపాక్ట్ ఎక్కువకాలం ఉంటుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. మరి అమీర్ ఖాన్ కూలీతో చేయబోయే ఇంపాక్ట్ ఎలా ఉంటుందో తెలియాలంటే ఆగస్టు 14 వరకు వెయిట్ చేయాల్సిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు