హీరోలకు, నిర్మాతలకు, దర్శకులకు సెంటిమెంట్లు ఉండటం కామన్. కానీ ఒకే సెంటిమెంట్ కొందరు హీరోలకు అందునా ఒకే కుటుంబానికి చెందిన హీరోలకు ఉంటే.. దాన్ని విశేషమనే అనాలి. ఇలాంటి విశేషమైన సెంటిమెంట్ ఒకదాన్ని మెగా ఫ్యామిలీ స్టార్ హీరోలు ఫాలో అవుతున్నారు. అదే 13వ తేదీ రిలీజ్. మెగాఫ్యామిలీ హీరోలంతా ఈ ఏడాది భారీ సినిమాలతో బాక్సాఫీస్ షేక్ చేయడానికి రెడీ అవుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న ‘ఆచార్య’ చిత్రం మే 13న విడుదల కానుంది.
అలాగే సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ చేస్తున్న మోస్ట్ క్రేజీయెస్ట్ ప్రాజెక్ట్ ‘పుష్ప’ ఆగష్టు నెల 13న విడుదలకానుంది. ఇక రామ్ చరణ్ రాజమంలోకి దర్శకత్వంలోకి ఎన్టీఆర్ తో కలిసి చేస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ అక్టోబర్ నెల 13వ తేదీనే ప్రేక్షకుల ముందుకురానుంది. ఇలా ముగ్గురు మెగా హీరోలు నెలలోని 13వ తేదీనే తమ విడుదల తేదీగా ఎంచుకోవడం కేవలం యాధృచ్ఛికమే అనిపించట్లేదు. దీని వెనుక ఏదో బలమైన కారణమే ఉన్నట్టు అనిపిస్తోంది. సంఖ్యా బలం లాంటి శాస్త్రాన్ని అనుసరించి మెగా ఫ్యామిలీ హీరోలు ఈ సెంటిమెంట్ ఫాలో అవుతున్నారో ఏంటో మరి.