మీసాల పిల్ల సాంగ్.. వింటేజ్ మెగాస్టార్‌ను చూస్తారా..?

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘మన శంకర వర ప్రసాద్ గారు’ ఇప్పటికే ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తుండగా ఈ మూవీ ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతోంది. ఇక ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ఈ మూవీపై మంచి బజ్ క్రియేట్ చేసింది.

తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ‘మీసాల పిల్ల’ అంటూ సాగే ఈ మెలోడీ సాంగ్‌ను లెజెండరీ సింగర్ ఉదిత్ నారాయణ్, శ్వేతా మోహన్ కలిసి పాడారు. గతంలోనూ చిరంజీవికి పలు బ్లాక్‌బస్టర్ సాంగ్స్‌ను ఉదిత్ నారాయణ్ పాడారు. దీంతో ఇప్పుడు మరోసారి ఈ కాంబో రిపీట్ కావడటంతో ఈ పాటపై అంచనాలు భారీగా క్రియేట్ అయ్యాయి.

ప్రోమోతోనే ఈ పాట అదిరిపోయే రెస్పాన్స్‌ను అందుకుంది. ఇక ఇప్పుడు రిలీజ్ అయిన ఈ పాటలో చిరంజీవి వింటేజ్ స్టెప్స్‌తో ఇరగదీశాడు. అటు లేడీ సూపర్ స్టార్ నయనతార కూడా ఈ పాటలో ఆకట్టుకుంది. ఈ పాటను భీమ్స్ సిసిరోలియో చక్కటి ట్యూన్స్‌తో కంపోజ్ చేయగా భాస్కరభట్ల లిరిక్స్ అందించారు. ఈ చిత్రాన్ని 2026 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.

Exit mobile version