‘లోక చాప్టర్ 1’ ఓటీటీ డేట్ వచ్చేస్తోంది..!

మలయాళ పరిశ్రమలో సంచలనం సృష్టించిన తాజా చిత్రం “లోక చాప్టర్ 1 : చంద్ర” ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.300 కోట్ల గ్రాస్‌ మార్క్‌ను దాటింది. కల్యాణి ప్రియదర్శన్‌ లీడ్ పాత్రలో నటించిన ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో కూడా ఘన విజయం సాధించింది.

ఇక ఈ సినిమా ఓటీటీ హక్కులు జియో హాట్‌స్టార్‌ సంస్థ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ చిత్రాన్ని త్వరలో ఓటీటీ స్ట్రీమింగ్‌కు తీసుకొచ్చేందుకు రెడీ అవుతున్నట్లు జియో హాట్‌స్టార్ ప్రకటించింది. “కమింగ్ సూన్” అంటూ ఆసక్తికరమైన టీజర్‌ను కూడా విడుదల చేసింది. అయితే, ఈ చిత్రం అక్టోబర్‌ 17న ఓటీటీ ప్రీమియర్‌గా ప్రసారం కానుందనే టాక్ వినిపిస్తోంది.

దుల్కర్‌ సల్మాన్‌ వే ఫారర్‌ ఫిలిమ్స్‌ బ్యానర్‌పై నిర్మించిన ఈ చిత్రంలో నస్లెన్‌, శాండీ మాస్టర్‌, అరుణ్‌ కురియన్‌, చందు సలీం కుమార్‌ వంటి నటులు కీలక పాత్రల్లో నటించారు. జేక్స్‌ బిజోయ్‌ ఈ చిత్రానికి సంగీతం అందించారు.

Exit mobile version