‘అసుర ఆగమన’కు టైమ్ ఫిక్స్.. !

eti-Gattu-Asura-Aagamana

మెగా హీరో సాయి దుర్గ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘సంబరాల ఏటి గట్టు’ భారీ అంచనాల మధ్య తెరకెక్కుతోంది. ఈ సినిమాను దర్శకుడు రోహిత్ కెపి డైరెక్ట్ చేస్తుండగా అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్‌కు సాలిడ్ రెస్పాన్స్ దక్కింది.

ఇక ఇప్పుడు ఈ చిత్ర హీరో సాయి దుర్గ తేజ్ బర్త్‌డే ట్రీట్‌గా అక్టోబర్ 15న ఈ చిత్రం నుంచి ‘అసుర ఆగమన’ అంటూ ఓ గ్లింప్స్‌ను రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ఇప్పటికే వెల్లడించారు. అయితే, ఈ గ్లింప్స్‌ను అక్టోబర్ 15న ఉదయం 11.34 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు.

ఈ సినిమాలో సాయి దుర్గ తేజ్ సరికొత్త లుక్‌తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేయబోతున్నాడు. ఈ సినిమాలో ఐశ్వర్య లక్ష్మీ హీరోయిన్‌గా నటిస్తుండగా జగపతి బాబు, సాయి కుమార్, శ్రీకాంత్, అనన్య నాగళ్ల తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కె.నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ప్రొడ్యూస్ చేస్తున్నారు.

Exit mobile version