కమ్ బ్యాక్ కోసం శ్రీను వైట్ల ఆరాటం.. హీరోదే లేటు..!

ఒకప్పుడు టాలీవుడ్‌లో హిట్‌ చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న శ్రీను వైట్ల ఇటీవల కాలంలో ఫామ్‌లో లేరు. ఆయన తెరకెక్కించిన రీసెంట్ సినిమాలన్నీ బాక్సాఫీస్‌ దగ్గర పరాజయం పాలవడంతో, ఆయన నుంచి ఒక సాలిడ్‌ కమ్-బ్యాక్‌ కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఆయన తెరకెక్కించిన లాస్ట్ మూవీ ‘విశ్వం’ కూడా ప్రేక్షకులను పూర్తిగా ఆకట్టుకోలేకపోయింది.

అయితే, ఇప్పుడు ఆయన కమ్ బ్యాక్ ఇచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. హీరో నితిన్‌ కాంబినేషన్‌లో ఆయన ఒక సినిమా చేసే అవకాశం ఉందంటూ ఇటీవల సినీ సర్కిల్స్‌లో వార్తలు వైరల్‌ అయ్యాయి. అయితే తాజా సమాచారం ప్రకారం, ఆ ప్రాజెక్టులో నితిన్‌ హీరో కాదట. ఆయన స్థానంలో శర్వానంద్‌ హీరోగా నటించే అవకాశం ఉన్నట్లు టాక్‌ వినిపిస్తోంది.

మరి ఈ వార్తపై అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుందని తెలుస్తోంది. శర్వానంద్‌తో చేసే ఈ చిత్రానికి శ్రీను వైట్ల ఎలాంటి జోనర్‌ ఎంచుకుంటాడు అనేది ఆసక్తికరంగా మారింది.

Exit mobile version