‘అఖండ 2’ సెకండాఫ్.. ఈ సెంటిమెంట్ ని బ్రేక్ చేస్తుందా?

Akhanda2

నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా హీరోయిన్ సంయుక్త అలాగే యంగ్ నటి హర్షాలీ మల్హోత్రా కీలక పాత్రల్లో దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న అవైటెడ్ చిత్రమే అఖండ 2 తాండవం. భారీ హైప్ ని సొంతం చేసుకున్న ఈ చిత్రం పాన్ ఇండియా లెవెల్లో గట్టిగానే వర్కౌట్ అవుతుంది అని మేకర్స్ ధీమాగా ఉన్నారు.

అయితే ఈ సినిమాలో మాత్రం ఫస్టాఫ్ అంతా ఒకెత్తు అయితే సెకండాఫ్ అంతా మరొక ఎత్తు అంటూ టాక్ ఇప్పుడు సినీ వర్గాల్లో స్ప్రెడ్ అవుతుంది. అఖండ 2 సెకండాఫ్ నుంచి మరో లెవెల్ కి వెళ్లిపోయే ట్రీట్ ఇస్తుంది అని ముఖ్యంగా డివోషనల్ కంటెంట్ మరియు యాక్షన్ పార్ట్ లు అలాగే బోయపాటి మార్క్ పవర్ఫుల్ పంచ్ డైలాగ్ లతో నాన్ స్టాప్ ర్యాంపేజ్ సెకండాఫ్ లో కనిపిస్తుంది అని వినిపిస్తుంది.

దీనితో అఖండ 2 సెకండాఫ్ పట్ల మరింత అంచనాలు నెలకొన్నాయి. ఏ సినిమాకి అయినా కూడా సెకండాఫ్ చాలా కీలకం అలాంటి సాలిడ్ సెకండాఫ్ లు ఈ మధ్య కాలంలో చాలా సినిమాల్లో మిస్ అవుతుంది అని సినీ ప్రేమికులు చెబుతున్నారు.

ఈ మధ్య కాలంలో వచ్చిన తెలుగు, తమిళ్ బిగ్ చిత్రాలకి కూడా ఈ కర్స్ ఉందని టాక్ ఉంది. కానీ సర్ప్రైజింగ్ గా అఖండ 2 లో సెకండాఫ్ నే బాగా వచ్చింది అని టాక్ మొదలైంది. మరి ఆ సెంటిమెంట్ ని అఖండ 2 బ్రేక్ చేస్తుందో లేదో తెలియాలి అంటే ఈ డిసెంబర్ 5 వరకు ఆగాల్సిందే.

Exit mobile version