‘కన్నప్ప’ కూడా వస్తుంది.. ‘దేవర’ సస్పెన్స్ వీడేదెప్పుడు?

Kannapa-and-devara

మంచు విష్ణు హీరోగా పాన్ ఇండియా లెవెల్లో అగ్ర తారాగణంతో దర్శకుడు ముకేశ్ కుమార్ సింగ్ తెరకెక్కించిన సాలిడ్ మల్టీస్టారర్ చిత్రమే “కన్నప్ప”. ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్ అలాగే మోహన్ బాబు లాంటి దిగ్గజాలు నటించిన ఈ చిత్రం థియేటర్స్ నుంచి ఓటిటికి రావడానికి కొంచెం సమయం తీసుకుంది కానీ టీవీ ప్రీమియర్ కి మాత్రం ఎక్కువ తీసుకోలేదు.

ఇలా తెలుగులో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ఈ దీపావళి కానుకగా జెమినీ టీవీ లో ప్రసారం అయ్యేందుకు సిద్ధం అయ్యింది. ఈ అక్టోబర్ 19న సినిమా ప్రసారం అవుతున్నట్టు అనౌన్స్ కాగా ఈ సినిమా కూడా ప్రీమియర్ కి వచ్చేస్తుంది కానీ దేవర సస్పెన్స్ మాత్రం అలానే కొనసాగుతుంది అని చెప్పాలి. థియేటర్స్ లో, ఓటిటిలో దేవర సాలిడ్ పెర్ఫామెన్స్ చేసినప్పటికీ శాటిలైట్ పరంగా ఎందుకు రాలేదు అనేది మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది.

కానీ లేటెస్ట్ గానే స్టార్ సంస్థ దేవర హక్కులు తీసుకున్నట్టుగా వచ్చిన టాక్ పలు ట్రోల్స్ కి చెక్ పెట్టినట్టు అయ్యింది. కానీ టీవీ ప్రీమియర్ డేట్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి దీనిపై అధికారిక క్లారిటీ ఎప్పటికి వస్తుందో బుల్లితెరపై వచ్చాక టీఆర్పీ పరంగా ఈ సినిమా ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుంది అనేది బిగ్ టాస్క్ గా మిగిలి ఉంది.

Exit mobile version