ప్రస్తుతం తమిళ సినిమా అందిస్తున్న అవైటెడ్ భారీ చిత్రాల్లో సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం “కూలీ” కూడా ఒకటి. మరి ఎన్నో అంచనాలు సెట్ చేసుకున్న ఈ సినిమా కోసం తెలుగు, తమిళ ఆడియెన్స్ చాలా ఎగ్జైటెడ్ గా ఉన్నారు. అయితే ఈ చిత్రంలో చాలా మంది అగ్ర తారలు ఉన్న సంగతి తెలిసిందే.
తెలుగు, తమిళ్, మళయాళ, కన్నడ సహా హిందీ భాషల నుంచి కూడా చాలా మంది ఉన్నారు. అయితే ఈ చిత్రంలో మరో యంగ్ హీరో సందీప్ కిషన్ ఉన్నట్టుగా పలు రూమర్స్ పై ఒక క్లారిటీ వచ్చింది. ఆ మధ్య సందీప్ కిషన్ కూలీ సెట్స్ లో సందడి చేయడం వైరల్ గా మారింది. అయితే ఈ సినిమాలో తాను కూడా ఉన్నాడా అనే మాటకి లేదనే తాను తెలిపాడు.
తన ఫ్రెండ్, దర్శకుడు లోకేష్ కోసం, రజినీకాంత్ గారి కోసం ఆరోజు సెట్స్ కి వెళ్ళాడట. ఇక అంతే కాకుండా తాను తాను సినిమాలో 45 నిమిషాల ఫుటేజ్ ని కూడా చూసినట్టు తెలిపాడు. సినిమా అదిరిపోయింది అని డెఫినెట్ గా 1000 కోట్ల సినిమాగా ఇది నిలుస్తుంది అని ఈ యంగ్ హీరో చెబుతున్నాడు. ఇక లేటెస్ట్ గానే సందీప్ కిషన్ “మజాకా” రిలీజ్ తో వచ్చిన సంగతి తెలిసిందే.