కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా పరిచయం అయినప్పటి నుంచి ఇప్పటి వరకు వైవిధ్యమైన పాత్రలు చేయడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు. రెగ్యులర్ గా కాకుండా అన్ని రకాల ఫార్మాట్ లలో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపుతుంటారు. అలాంటి నాగార్జునని మీ సినీ జీవితంలో ఇంకా చేయాలనుకున్న పాత్ర లేదా వెలితిగా అనిపించే సందర్భం ఏమన్నా ఉందా అని అడిగితే నాగార్జున సమాధానమిస్తూ ‘ నాకు ఎప్పటి నుండో ఒక పౌరాణిక సినిమా చేయాలని ఉంది. ప్రస్తుతం ఉన్న సాంకేతిక విలువలని ఉపయోగించుకొని ‘మాయా బజార్’ ని తీస్తే అందులో నటించాలన్నది నా కోరిక. అవతార్ సినిమాని ఎంత బాగా తీసారు. అలాంటి ప్రయోగాత్మక సినిమాలు చేయకూడదనిపిస్తుందని’ ఆయన అన్నారు.
అలాగే మాట్లాడుతూ ‘ సినిమా హిట్ అవుతుందా? ఫ్లాప్ అవుతుందా? అనే దాన్ని కరెక్ట్ గా జడ్జ్ చెయ్యలేను. ఇంకో 100 సినిమాలు తీసినా అది నా వల్ల కాదని నాగార్జున అన్నాడు. నాగార్జున నటించిన మాస్ ఎంటర్ టైనర్ ‘భాయ్’ ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. చౌదరి డైరెక్ట్ చేసిన ఈ మూవీలో రిచా గంగోపాధ్యాయ్ హీరోయిన్ గా నటించింది.