ఇళయ థలపతి విజయ్ హీరోగా మాళవిక మోహనన్ హీరోయిన్ గా లోకేష్ కనగ్ రాజ్ దర్శకత్వంలో తెరకెక్కించిన భారీ చిత్రం “మాస్టర్”. చాలా కాలం అనంతరం థియేటర్స్ లోనే విడుదల కాబడ్డ ఈ చిత్రం అంతే త్వరగా ఓటిటి లో కూడా వచ్చేసిన సంగతి తెలిసిందే. కేవలం16 రోజుల్లోనే అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ చిత్రం వచ్చేసింది. అయితే మరి ఈ మోస్ట్ అవైటెడ్ చిత్రం ఓటిటి ప్లాట్ ఫామ్ లో కూడా హిట్టే అని తెలుస్తుంది.
ఈ చిత్రానికి మొట్ట మొదటి రోజు 9.2 మిలియన్ వ్యూస్ రాగా ఆ వారాంతం పూర్తయ్యే సరికి 28 మిలియన్ వ్యూస్ వచ్చాయట.అయితే మరి ఇది ఒక్క తమిళ్ లోనా విడుదల కాబడ్డ అన్ని భాషల్లోనా ఆనంది క్లారిటీ రాలేదు కానీ మాస్టర్ చిత్రం మాత్రం ఓటిటి లో కూడా సూపర్ హిట్టే అని ఓటిటి నిపుణులు అంటున్నారు. ఇక ఈ సాలిడ్ చిత్రంలో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి పవర్ ఫుల్ విలన్ రోల్ లో నటించగా అనిరుధ్ అదిరిపోయే మ్యూజిక్ ఆల్బమ్ ను ఇచ్చాడు.