మాస్ రాజా రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ ‘మాస్ జాతర’ ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. అయితే, ఈ సినిమా రిలీజ్ డేట్‌లో మార్పు ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అక్టోబర్ 31న ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉండగా అదే రోజు ‘బాహుబలి: ది ఎపిక్’ విడుదలవుతోంది. దీంతో మాస్ జాతర రిలీజ్ డేట్‌ను వాయిదా వేశారట మేకర్స్.
అక్టోబర్ 31 రాత్రి స్పెషల్ పేడ్ ప్రీమియర్స్‌తో, నవంబర్ 1న థియేటర్లలో ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తుంది. భాను భోగవరపు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్‌గా నటించగా, భీమ్స్ సంగీతం అందించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమా ట్రైలర్ అక్టోబర్ 27న విడుదల కానుంది.
