‘మారుతి – నాని’ కాంబినేషన్ మళ్ళీ సినిమా రాబోతుంది అంటూ గత కొన్ని నెలలుగా ఓ రూమర్ గా ఆనవాయితీ మారిపోయింది. మళ్ళీ ఇప్పుడు వీళ్ళ కలయికలో సినిమా వస్తోందట. తాజాగా సినీ వర్గాల సమాచారం వీరి కాంబినేషన్ మళ్లీ పట్టాలెక్కే సినిమా కోసం మారుతి ఫుల్ ఎంటర్ టైనర్ స్క్రిప్ట్ ను సిద్ధం చేశాడట. మారుతి ఇప్పటికే నానికి కథ చెప్పినట్లు.. నాని కూడా స్క్రిప్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఇక ‘భలే భలే మగాడివోయ్’ సినిమా నేచురల్ స్టార్ నాని కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.
కాగా ఆ సినిమాతోనే నాని మార్కెట్ స్థాయి కూడా పెరిగింది. అందుకే వీరి కాంబినేషన్ లో ఇప్పుడు సినిమా వస్తే భారీ అంచనాలు ఉంటాయి. నిజానికి ‘భలే భలే మగాడివోయ్’ తర్వాత మారుతి, నాని కలిసి మరొక సినిమా చేస్తే బాగుంటుందని ప్రేక్షకులు కూడా సోషల్ మీడియా ద్వారా బాగానే కోరుకున్నారు. అందుకు తగ్గట్లుగానే మారుతి, నానిలు కూడా మరొసారి కలిసి వర్క్ చేయాలని చాలాసార్లే అనుకున్నారు. కానీ ఇప్పటివరకు వీరి సినిమా పట్టాలెక్కలేదు. ఇప్పుడు మళ్ళీ వీరి కలయిక గురించి వార్తలు వస్తున్నాయి.