కొత్త సినిమా బిజీలో మణిరత్నం

కొత్త సినిమా బిజీలో మణిరత్నం

Published on Mar 3, 2013 4:05 AM IST

Mani-Ratnam

మణిరత్నం దర్శకత్వం వహించిన సినిమా కడలి ఈ మద్య విడుదలై ఆశించినంత విజయాన్నిసాదించలేకపోయింది. ఇంతలోనే ఆయన మరో సినిమాకి చేసే పనిలో బిజీగా వున్నారు. ఈ సినిమా ఇండియా -పాకిస్తాన్ బ్యాక్ డ్రాప్ లో ప్రేమ కథా చిత్రంగా తెరకెక్కనుందని సమాచారం. మంచి విజయాన్ని సాదించిన ‘గదర్’, ‘వీర్ జర’ సినిమాల ఈ సినిమా ఉండవచ్చునని బావిస్తున్నారు. గతంలో ‘రంగ్దే బసంతి’ చిత్రానికి కథ అందించిన రెన్సిల్ డి సిల్వా కూడా మణిరత్నంతో కలిసి ఈ సినిమా కోసం కథ అందిస్తున్నాడు. ఈ సినిమా కోసం హీరో, హీరోయిన్ ను గానీ, టెక్నికల్ టీంని గానీ ఇంకా ఖరారు చేయలేదు. ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళడానికి ఇంకాస్త సమయం పట్టవచ్చునని సమాచారం

తాజా వార్తలు