ఇంటర్వ్యూ : మంచు మనోజ్ – ‘భైరవం’ నా కెరీర్‌లో ప్రత్యేకం!

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ మోస్ట్ అవైటెడ్ యాక్షన్ థ్రిల్లర్ ‘భైరవం’. టీజర్, పాటలు, ప్రమోషనల్ కంటెంట్‌కు అద్భుత స్పందనతో, పాజిటివ్ బజ్‌తో ముందుకు దూసుకెల్తుతోంది. విజయ్ కనకమేడల దర్శకత్వంలో, శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కె.కె. రాధామోహన్ భారీ నిర్మించారు. పెన్ స్టూడియోస్ డాక్టర్ జయంతీలాల్ గాడా సమర్పిస్తున్నారు. ఈ సినిమా మే 30న వేసవి సీజన్‌లో బిగ్గెస్ట్ రిలీజ్ కి సిద్ధమవుతోంది. అలాగే మే 20 మంచు మనోజ్ బర్త్ డే. ఈ నేపథ్యంలో మనోజ్ మంచు విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.

భైరవం జర్నీ ఎలా స్టార్ట్ అయింది?

ఒక సినిమా ఈవెంట్ కి వెళ్ళినప్పుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారు కలిశారు. డైరెక్టర్ విజయ్ నన్ను కలవాలని అనుకుంటున్నారని చెప్పారు. అలా ఫోన్ నెంబర్ ఇవ్వడం జరిగింది. విజయ్ గారు ఈ కథ గురించి చెప్పారు. నాకు చాలా నచ్చింది. ఇమ్మీడియట్ గా ఓకే చేశాను. ఇది చాలా మంచి యాక్షన్ డ్రామా.

ఈ సినిమాలో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది ?

గజపతి వర్మ లాంటి క్యారెక్టర్ ఇప్పటివరకు నేను చేయలేదు. చాలా ఇంటెన్స్ అండ్ ఫెరోషియస్ క్యారెక్టర్. భైరవం తప్పకుండా నా కెరియర్ లో చాలా ప్రత్యేకంగా నిలుస్తుంది.

ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో చాలా ఎమోషన్ అయ్యారు కదా?

తొమ్మిదేళ్లయింది సినిమాలకి దూరమై. కొన్ని కారణాల వల్ల బ్రేక్ తీసుకున్నాను. ఇప్పుడు మళ్లీ సినిమాతో ప్రేక్షకులు ముందుకు రావడం వెరీ ఎమోషనల్ మూమెంట్.

నాన్నగారు నుంచి మీరు ఏం నేర్చుకున్నారు?

నమ్మినోల్ని బాగా చూసుకోవడం, పదిమందికి హెల్ప్ చేయడం. ఆయన కష్టపడుతూ పైకి వచ్చారు. ఆయన ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకం. నిజాయితీగా ఉండడం ఆయన దగ్గరే చూసి నేర్చుకున్నాను. నాకు మా ఫాదరే హీరో.

డైరెక్టర్ విజయ్ కనకమెడల గురించి ?

విజయ్ తెలుగు ఆడియన్స్ పల్స్ మీద చాలా మంచి గ్రిప్ ఉంది. అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఈ సినిమాని ప్రజెంట్ చేశారు. గరుడన్ సినిమా చూసిన వాళ్లు కూడా ఈ సినిమా చూస్తే చాలా సర్ప్రైజ్ అవుతారు. తన మీద చాలా గౌరవం పెరిగింది. ఆయన లాంటి డైరెక్టర్స్ మరింత మంది రావాలి. ఈ సినిమాలో నా లుక్ ని నా లుక్ కాస్ట్యూమ్స్ ని డిజైన్ చేసింది కూడా డైరెక్టర్ గారే. సినిమా చూసాం చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాం. సినిమా మాకు చాలా నచ్చింది. తప్పకుండా అందరికీ నచ్చుతుందని నమ్మకం ఉంది.

శ్రీ చరణ్ మ్యూజిక్ గురించి?

శ్రీ చరణ్ బ్యూటిఫుల్ ఆల్బమ్ ఇచ్చారు. రేపు ఒక స్పెషల్ సాంగ్ రాబోతుంది. సాంగ్ అదిరిపోయింది. మీ అందరికీ నచ్చుతుంది. ఈ సినిమాలో బ్యాక్గ్రౌండ్ స్కోరు చింపేసాడు. రేపు సినిమా చూసిన అందరూ కూడా ఇదే చెప్తారు.

నిర్మాత రాధా మోహన్ గారి గురించి?

ఈ రోజుల్లో అలాంటి ప్యాసినేట్ ప్రొడ్యూసర్ ఉండడం చాలా అరుదు. కథను నమ్మి ఎక్కడ రాజీ పడకుండా చేశారు. రియల్లీ హాట్సాఫ్ అలాంటి నిర్మాతల్ని మనం ఎంకరేజ్ చేయాలి.

నెక్స్ట్ మీ దగ్గర నుంచి ఎలాంటి సినిమాలు ఆశించవచ్చు?

నేను బిగినింగ్ నుంచి చాలా ఎక్స్పరిమెంటల్ సినిమాలు చేశాను. నాకు ఒక సినిమాకి మరొక సినిమాకి కంప్లీట్ డిఫరెంట్ ఉండే సినిమాలు చేయాలని ఎప్పుడూ ఉంటుంది. భవిష్యత్తులో కొత్త రకం సినిమాలు చేయాలని వుంది.అలాగే పిల్లల కోసం ఒక సినిమా చేయాలనుంది. ఎప్పుడైనా అవకాశం వస్తే అలాంటి ఒక సినిమా చేస్తాను.

Exit mobile version