ఇప్పుడు వరకు టాలీవుడ్ లో చాలానే సినిమాలు బాగా ఆలస్యం అవుతూ వచ్చాయి కానీ వాటి అన్నిటినీ మించి దాదాపు ఐదేళ్ల తర్వాత విడుదలకి వస్తున్నా భారీ చిత్రమే “హరిహర వీరమల్లు”. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్ అందులోని మునుపెన్నడూ చేయని కొత్త రోల్ ని దర్శకుడు క్రిష్ తో అనౌన్స్ చేస్తే అభిమానులు చాలా ఎగ్జైట్ అయ్యారు.
ఇక అలా మొదలై ఇపుడు విడుదల కావడానికి ఐదేళ్లు పట్టింది. ఇక ఫైనల్ గా ఇంకొన్ని గంటల్లో ఫుల్ ఫ్లెడ్జ్ గా రిలీజ్ కి వస్తున్న ఈ సినిమా ఇప్పుడు వరకు అనేక ఛాలెంజ్ లని ఎదుర్కొంది. దర్శకుడు మారడం అనేక వాయిదాలు కరోనా ఇలా చాలానే ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇక ఎట్టకేలకి థియేటర్స్ లో రిలీజ్ కి వస్తున్న ఈ సినిమాకి అవేవి కాదు అసలు ఛాలెంజ్ ఇప్పుడుంది అని చెప్పాలి.
అదే ‘పైరసీ భూతం’. ఈ మధ్య కాలంలో వచ్చిన చాలా సినిమాలు రిలీజ్ రోజునే ఫుల్ హెచ్ డి క్లారిటీతో కూడిన ప్రింట్ లు బయటకి వచ్చేసాయి. తండేల్, గేమ్ ఛేంజర్ ఇంకా కంగువా లాంటి సినిమాలు షాకిచ్చాయి. దీనితో మేకర్స్ కి ఇవి చాలా పెద్ద తలనొప్పిగా మారాయి. మరి హరిహర వీరమల్లు సినిమాకి కూడా ఇది పెద్ద ఛాలెంఙ్ అని చెప్పవచ్చు. ఈ అంశంలో ఏమవుతుందో చూడాలి.