వీరమల్లు ర్యాంపేజ్ షురూ.. ఆదిలోనే హాప్ మిలియన్ క్రాస్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైటెడ్ మూవీ ‘హరిహర వీరమల్లు’ ర్యాంపేజ్ మొదలైంది. ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా ప్రీమియర్స్ రూపంలో ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఇక నేడు (జూలై 24) ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ అంచనాల మధ్య గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అయింది.

ఈ సినిమా కోసం కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్‌లోనూ అదిరిపోయే అంచనాలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా యూఎస్‌లో ఈ సినిమా కేవలం ప్రీమియర్స్‌తోనే దుమ్ములేపుతోంది. ఈ చిత్రం యూఎస్ ప్రీమియర్స్‌లో ఏకంగా 550K డాలర్లకుపైగా గ్రాస్ వసూళ్లు రాబట్టినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి.

కేవలం ప్రీమియర్స్‌కే ఈ రేంజ్ వసూళ్లు రాబట్టిందంటే, ఇక తొలిరోజు, ఆ తర్వాత వీకెండ్‌లో ఈ సినిమా కలెక్షన్స్ ఏ రేంజ్‌లో ఉండబోతున్నాయా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఏదేమైనా పవన్ అభిమానులు ఇంతకాలంగా చూస్తున్న రికార్డుల విధ్వంసం మొదలైందని చెప్పాలి.

Exit mobile version