ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మేనియా మళ్ళీ మొదలైంది. చాలా కాలం తర్వాత పవన్ నుంచి వచ్చిన స్ట్రైట్ సినిమా కావడం అందులో హిస్టారికల్ సినిమా కావడంతో ఎట్టకేలకి ఓపెనింగ్స్ వరకు సాలిడ్ హైప్ ని అందుకొని దూసుకొస్తోంది. అయితే పవన్ సినిమాలకి సింగిల్ స్క్రీన్స్ లో రెండు తెలుగు రాష్ట్రాల్లో క్రేజీ రికార్డులు ఉన్నాయి.
అలాగే పవన్ సినిమాలు అంటే ఉత్తరాంధ్రలో హంగామా మామూలు లెవెల్లో ఉండదు. పవన్ కెరీర్ లో వచ్చిన పలు భారీ హిట్స్ కి సెలబ్రేషన్స్ గట్టిగా జరిగిన ఐకానిక్ థియేటర్స్ లో వైజాగ్ జగదాంబ థియేటర్ కూడా ఒకటి. ఇప్పటికీ విశాఖ మొత్తంలో టాప్ సింగిల్ స్క్రీన్ ఏదన్నా ఉంది అంటే జగదాంబ 70ఎంఎం అనే చెప్తారు.
మరి ఇక్కడ పవర్ స్టార్ హరిహర వీరమల్లు రిలీజ్ కి రిలీజ్ కి ఏకంగా 75 అడుగుల భారీ కటౌట్ పెట్టిన దృశ్యాలు వైరల్ గా మారాయి. జగదాంబ థియేటర్ సెంటర్ క్లాక్ టవర్ దగ్గర ఈ భారీ కటౌట్ ని లాంచ్ చేశారు. ఇక ఈ థియేటర్ లో వీరమల్లు ఎలాంటి రికార్డ్స్ సెట్ చేస్తుందో చూడాలి.